మహానుభావుడు మళ్లీ కొట్టేస్తాడా..!

శర్వానంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానుభావుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 29న దసరా కానుకగా రిలీజ్ అవుతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద క్రేజ్ వచ్చేలా చేసింది. ఇక సెన్సార్ నుండి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శర్వానంద్ మరో హిట్ అందుకుంటాడని అంటున్నారు.

పండుగ సీజన్ అంటే శర్వానంద్ కు భలే కలిసి వస్తుంది. ఇప్పటికే సంక్రాంతి రాజాగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఈసారి దసరాకి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. దసరా బరిలో ఇప్పటికే తారక్ జై లవ కుశగా రాగా మరో నాలుగు రోజుల్లో మహేష్ స్పైడర్ గా వస్తున్నాడు. ఇక మహేష్ సినిమా రిలీజ్ అయిన 2 రోజులకే వస్తున్న మహానుభావుడు జై లవ కుశ ఎన్.టి.ఆర్ డివైడ్ టాక్ తమకు పాజిటివ్ అవుతుందని భావిస్తున్నారు.

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ఒకవేళ మహేష్ స్పైడర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కనుక మహానుభావుడు ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది.

 

Leave a comment