Videosశంభో శంకర టీజర్.. వామ్మో షకలక శంకరేనా..!

శంభో శంకర టీజర్.. వామ్మో షకలక శంకరేనా..!

జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన షకల శంకర్ హీరోగా ప్రమోట్ అయ్యాడు. కమెడియన్ గా పలు సినిమాల్లో ఆడియెన్స్ ను అలరించిన శంకర్ ఇప్పుడు హీరోగా చేస్తున్న తొలి ప్రయత్నం శంభో శంకర. శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. టీజర్ లో డైలాగ్స్, ఫైట్, డ్యాన్స్ అబ్బో మనం చూస్తుంది షకలక శంకర్ టీజరేనా అన్న భావన కలుగుతుంది.

శంకర్ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. సాయి కార్తిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవనుంది. కారుణ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రమణ రెడ్డి, సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. టీజర్ తో సినిమాలో మ్యాటర్ ఉన్నట్టు చూపించిన శంకర్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మాస్ ఆడియెన్స్ మెప్పించే కథ, కథనాలతో షకలక శంకర్ చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసించేదిగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news