Gossipsచింపాంజీ తో శాలిని పాండే !

చింపాంజీ తో శాలిని పాండే !

శాలిని పాండే .. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ అందరిని ఆకట్టుకుంది. అంతే కాదు ఆ తరువాత వరుసపెట్టి తెలుగు, తమిళ్ సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తోంది ఈ భామ. ప్ర‌స్తుతం ‘మ‌హాన‌టి’లో ఓ కీల‌క పాత్ర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే ’100% ల‌వ్’ రీమేక్ ’100 % కాద‌ల్’ చిత్రంలో న‌టిస్తున్న షాలినీ.. త‌మిళ క‌థానాయ‌కుడు జీవాతో మ‌రో సినిమా చేయబోతోంది.

జ‌న‌వ‌రి 22 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి ’గొరిల్లా’ అనే పేరుని నిర్ణ‌యించారు. విశేష‌మేమిటంటే.. ఇందులో ఓ చింపాంజీ కీల‌క పాత్ర పోషిస్తోంది. థాయ్‌ల్యాండ్‌లోని స‌మ్యూట్ ట్రైనింగ్ స్టేష‌న్‌లో శిక్ష‌ణ పొందిన చింపాంజీ ఈ చిత్రంలో సంద‌డి చేయబోతోందట. ఫిబ్ర‌వ‌రి నుంచి బ్యాంకాక్‌లో జ‌రిగే షెడ్యూల్స్‌లో ఈ చింపాంజీతో జీవా, షాలినీ క‌లిసి న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. డాన్ సాండీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news