డబ్బే కావాలనుకుంటే అలాంటి సినిమాలు చేసేదాన్ని.. షాలిని పాండే సంచలన కామెంట్స్..!

128

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది షాలిని పాండే. విజయ్ దేవరకొండతో బీభత్సమైన రొమాన్స్ పండించిన ఈ అమ్మడు ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే అర్జున్ రెడ్డి రిజల్ట్ ను క్యాష్ చేసుకునేలా విజయ్ దేవరకొండ మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. అర్జున్ రెడ్డి ఏర్పరచిన ఇమేజ్ తో తర్వాత సినిమాలతో అతను స్టార్ గా మారాడు. అయితే షాలిని పాండే మాత్రం ఇంకా అంత పాపులర్ కాలేదు.

తెలుగుతో పాటుగా తమిళంలో నటిస్తున్న ఈ అమ్మడు అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి సినిమా ఆఫర్లే వచ్చాయట. కాని మనసుకి నచ్చిన కథలను మాత్రమే చేయాలనుకున్న షాలిని ఆ సినిమాలను వద్దనుకుందట. మహానటి, ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది షాలిని పాండే. డబ్బే కావాలని అనుకుంటే తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసేదాన్నని.. అలా చేయాలనుకోవడం లేదని అంటుంది షాలిని పాండే.

రీసెంట్ గా కళ్యాణ్ రాం తో 118 సినిమా చేసి సక్సెస్ అందుకున్న షాలిని పాండే మంచి కథలను మాత్రమే చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తమిళంలో 100% లవ్ రీమేక్ లో నటించిన ఈ అమ్మడు అక్కడ కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.

Leave a comment