Movies" శైలజ రెడ్డి అల్లుడు " ఆఫీషియల్ ట్రైలర్

” శైలజ రెడ్డి అల్లుడు ” ఆఫీషియల్ ట్రైలర్

అక్కినేని నాగ చైతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ కనిపించేలా కామెడీతో కితకితలు పెడుతుంది ఈ ట్రైలర్. నా పేరు చైతన్య ముద్దుగా అందరు చైతు అంటారు.. నేను దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటా.. మనం లైఫ్ లో ప్రేమించే ప్రతి దాని వెనుక ఓ కష్టం ఉంటుందంటూ చైతు క్యారక్టర్ ఎలివేట్ చేశాడు మారుతి.

ట్రైలర్ లో చూస్తే అత్తా కూతురు మధ్యలో అల్లుడు ఆట ఆడేసుకున్నట్టు తెలుస్తుంది. వారిద్దరిని కలపడమే హీరో పని. చివర్లో డాడీ స్కీం వర్క్ అవుట్ అయినట్టు ఉందని చెప్పగా.. బ్యాక్ గ్రౌండ్ లో ప్రియరాగాలే సాంగ్ మ్యూజిక్ వదిలాడు. చూస్తుంటే చైతుకి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news