Movies" శైలజ రెడ్డి అల్లుడు " అఫిషియల్ టీజర్..

” శైలజ రెడ్డి అల్లుడు ” అఫిషియల్ టీజర్..

ఈరోజుల్లో సినిమా నుండి మహానుభావుడు వరకు మారుతి సినిమా అంటే పక్కా హిట్ అన్న టాక్ ఉంది. కథ ఎలాంటిదైనా సరే ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా తన సినిమాలు ఉండేలా చూసే మారుతి మొదటిసారి నాగ చైతన్య హీరోగా చేస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఎస్ నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

హీరోయిన్ కు ఈగో అంటూ తన క్యారక్టర్ తెలిసేలా చేశాడు. ఇక సినిమాలో ప్రధాన పాత్రగా శివగామి రమ్యకృష్ణ నటిస్తుంది. పెళ్లి తర్వాత చైతన్య చేస్తున్న ఈ సినిమా టీజర్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్టు 31న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నాగ చైతన్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ సినిమా బిజినెస్ లో కూడా చైతు కెరియర్ లో హయ్యెస్ట్ గా బిజినెస్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news