సినిమాలు లేక ఈగలు కొడుతున్న స్టార్ హీరో

Shah Rukh Khan Has No Films In Hand

స్టార్ హీరోగా కొన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలిన హీరో ఇప్పుడు సినిమాలు లేక ఈగలు కొట్టుకోవడంతో అతడి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. సంవత్సరానికో సినిమా చేస్తూ వచ్చిన ఈ హీరో వరుసబెట్టి డిజాస్టర్లు తీయడంతో అతడి ఫ్యాన్స్ సైతం సినిమాలు ఆపేయాలంటూ కోరారు. దీంతో ఇప్పుడు ఆయన గత ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? అయితే మేటర్‌లోకి వెళ్దాం పదండీ!

బాలీవుడ్‌ బాద్‌షాగా తనదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న షారుఖ్ ఖాన్ గతకొంతకాలంగా సరైన హిట్స్ లేక ఢీలా పడ్డాడు. మనోడు తీసిని లాస్ట్ మూవీ ‘జీరో’ పేరుకు తగ్గట్లుగానే ఫలితాన్ని రాబట్టింది. దీంతో షారుఖ్ సినిమాలు ఆపేస్తే బాగుంటుందని చాలా మంది అన్నారు. ఇది తెలుసుకున్న షారుఖ్ చాలా ఫీల్ అయ్యాడు. దీంతో సరైన కథ దొరికే వరకు సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాడు. కాగా ఆయన కూతురు, కొడుకు చదువుల కోసం కాస్త బ్రేక్ తీసుకున్నానంటూ కవరింగ్ చేస్తున్నాడు బాద్‌షా.

తన ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడిపేందుకే ఈ గ్యాప్ తీసుకున్నట్లు ఆయన అన్నారు. మంచి కథ దొరికినప్పుడే సినిమాను ఓకే చేస్తానని ఆయన అంటున్నారు. మరి బాద్‌షా మళ్లీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని బాలీవుడ్ జనం చాలా ఆశగా చూస్తున్నారు.

Leave a comment