శభాష్ పవన్……పొలిటికల్ అడుగులకు ప్రశంసలు!!

pawan-kalyan-political-step

ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ తెరపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉద్ధాన బాధితుల పక్షాన నిలబడి ప్రశ్నించడం రాజకీయ మేధావుల ప్రశంశలు అందుకుంటోంది. దశాబ్ధాలుగా సమస్య ఉన్నప్పటికీ పాలకులు ఎందుకు పరిష్కారం కనుగొనలేకపోయారు? పుష్కరాల కోసం వందల కోట్లు ఖర్చుపెట్టే ప్రభుత్వం కిడ్నీ సమస్యలతో వేలాది మంది చనిపోతూ ఉంటే కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు? ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం వంద కోట్లు సరిపోతాయని మేధావులు చెప్తున్నారు. మరి వేలాది పేదల కోసం ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి ప్రభుత్వానికి మనసురావడం లేదా?

pawan kalyan

ఈ సమస్యపైన స్పందించడానికి ప్రభుత్వానికి 48గంటల టైం ఇస్తున్నాను. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమించడానికి కూడా రెడీ. ఈ సమస్యపైన అధ్యయనం చేయడానికి ఐదుగురు నిపుణులతో కమిటీ వేస్తున్నాను. వాళ్ళు 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ పట్టుకుని స్యయంగా నేనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తాను…..అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఓవరాల్‌గా రెగ్యులర్ రాజకీయ నాయకుల్లా కాకుండా ఓ సమస్యకు పరిష్కారం కనుగొనాలన్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాలను మాత్రం అందరూ అభినందిస్తున్నారు. వేలాది మంది పేదలు దశాబ్ధాలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడతున్నప్పటికీ వేరే ఏ రాజకీయ నాయకుడూ పట్టించుకోని దశలో జనసేన అధినేత ఆ జనం మధ్యకు వెళ్ళడం మాత్రం నిజంగా అభినందించాల్సిన విషయం అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Leave a comment