Moviesకాజల్ పేరుతో మోసం..రూ.60 లక్షలు టోకరా!

కాజల్ పేరుతో మోసం..రూ.60 లక్షలు టోకరా!

ఈ మద్య డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో మోసపూరిత పద్దతులు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ పేరు చెప్పుకొని మోసం చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. సినిమా, టివిల్లో ఛాన్సులు ఇప్పిస్తామని అమాయక కళాకారులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఇటీవల జబర్ధస్త్ పేరు తో చాలా మంది మోసాని తెగబడ్డారని ఫిర్యాదు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఇప్పుడు హీరోయిన్ కాజల్ పేరు తో ఓ అమాయకుడిని దారుణంగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన బాగా డబ్బున్న ఒక శ్రీమంతుడు కొడుకుకు కాజల్ అంటే ఎంతో ఇష్టం.

ఒక రోజు ఇంటర్నెట్‌ను చాట్ చేస్తుండగా.. మీకు బాగా ఇష్టమైన స్టార్‌తో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామంటూ ఒక ప్రకటన వచ్చింది. అంతే ఒక్కసారి తన కలల రాణి కాజల్ ని కలవాలని డేటింగ్ చేయాలని సంతోషంతో అవతలి వ్యక్తి మాటలకు లొంగిపోయాడు. మొదట రూ.50 డిపాజిట్ చేయాలని చెప్పగా ఎందుకూ..? ఏమిటీ అని ఆలోచించకుండా చేశాడు. ఆ తర్వాత ఇంకొంత అమౌంట్ డిమాండ్ చేసాడు.

విడతల వారీగా అతడు అడిగిన అమౌంట్ వేస్తూనే ఉన్నాడు. ఇలా రూ.10 లక్షల వరకు సమర్పించుకున్న తర్వాత అతను ఎంతకు కాజల్‌ను పరిచయం చేయకపోవడంతో అసలు కాజల్ పరిచయం అవుతుందా లేదా? సీరియస్ గా ప్రశ్నించాడు. అంతే అవతలి వ్యక్తి నుంచి నీకు కాజల్ కావాలని బలవంతం చేస్తున్నావని..నీ బండారం బయట పెడతాని ఉల్టా బెదిరించాడు. ఆ తర్వాత అతడి బ్లాక్ మెయిలర్ అతడి నుంచి ఏకంగా రూ.60 లక్షల వరకు లాగాడు.

ఆ తర్వాత ఆగకుండా ఇంకా పీడించడంతో అతడు వారి బాధను తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయాడు. అయితే తమ కొడుకు ఏదో బాధలో ఉన్నాడని..ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం కనిపెట్టి…నింధితున్ని పట్టుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news