చైతు సవ్యసాచి వీకెండ్ కలక్షన్స్.. ఆందోళనలో బయ్యర్లు..!

27

అక్కినేని నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా నవంబర్ 2న రిలీజ్ అయ్యి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది.

కార్తికేయ, ప్రేమం సినిమాల తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం సవ్యసాచి నిరాశపరచింది. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా వీకెండ్ వరకు 8.10 కోట్లు కలెక్ట్ చేసింది.

ఏరియావైజ్ సవ్యసాచి కలక్షన్స్ వివరాలు..

నైజాం : 2.15 కోట్లు

సీడెడ్ : 1.10 కోట్లు

వైజాగ్ : 0.93 కోట్లు

ఈస్ట్ : 0.34 కోట్లు

వెస్ట్ : 0.33 కోట్లు

కృష్ణా : 0.47 కోట్లు

గుంటూరు : 0.70 కోట్లు

నెల్లూరు : 0.27 కోట్లు

ఏపి/తెలంగాణా :6.29 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.75 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 1.05 కోట్లు

వరల్డ్ వైడ్ : 8.10 కోట్లు

Leave a comment