సవ్యసాచి ఫస్ట్ వీక్ కలక్షన్స్.. చైతుకి ఇది భారీ డిజాస్టర్..!

49

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సినిమా సవ్యసాచి. నవంబర్ 2న రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ విలన్ గా నటించడం జరిగింది. కార్తికేయ, ప్రేమం సినిమాల తర్వాత చైతు, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రిలీజై వారం అవుతున్న ఈ సినిమా 8.97 కోట్లు మాత్రమే వసూళు చేసింది. కొత్త సినిమాల సందడిలో సవ్యసాచి కొట్టుకుపోయే అవకాశం ఉంది.

ఇక ఏరియాల వారిగా సవ్యసాచి మొదటి వారం వసూళ్లు

నైజాం : 2.35 కోట్లు

సీడెడ్ : 1.20 కోట్లు

వైజాగ్ : 1.03 కోట్లు

ఈస్ట్ : 0.41 కోట్లు

వెస్ట్ : 0.39 కోట్లు

కృష్ణా : 0.60 కోట్లు

గుంటూరు : 0.75 కోట్లు

నెల్లూరు : 0.34 కోట్లు

ఏపి/తెలంగాణ : 7.07 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : ఋస్ 0.80 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 1.10 కోట్లు

వరల్డ్ వైడ్ : 8.97 కోట్లు

Leave a comment