Gossips'సంజు' సెక్సీ సీక్రేట్‌...!

‘సంజు’ సెక్సీ సీక్రేట్‌…!

బాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హవా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్రతో సంజూ సినిమా వస్తుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాను రాజ్ కుమారి హిరాణి డైరెక్ట్ చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని పెంచాయి.

ట్రైలర్ లో భాగంగా సంజయ్ దత్ మాఫియాతో సంబంధాలు, డ్రగ్ ఎడిక్ట్, అమ్మాయిలతో అక్రమ సంబంధాలు లాంటి విషయాల గురించి కూడా ప్రస్థావించారు. ముఖ్యంగా 300 మందికి పైగా అమాయిల్తో అక్రమ సంబంధం విషయం ట్రైలర్ లో డిస్కస్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంపై సంజయ్ దత్ భార్య మాన్యత స్పందించారు. నా భర్త చాలా మంచోడని.. ఏ వ్యక్తి పూర్తి నిజాయితీ పరుడని చెప్పలేం. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులు ఉంటాయి. అందుకే సంజయ్ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు మాన్యత.

అంతేకాదు జీవిత కథ సినిమాగా తీసేప్పుడు సినిమాటిక్ లిబర్టి ఉంటుంది. అందుకే కమర్షియాలిటీ కోసం అలా అమ్మాయిల విషయంలో కొంత లిబర్టీ తీసుకుని ఉండొచ్చని సినిమాలో తన భర్త పాత్రని వెనుకేసుకు వచ్చింది మాన్యత. రణ్ బీర్ కపూర్ మాత్రం సంజూ పాత్రలో జీవించేశాడని టీజర్, ట్రైలర్స్ బట్టి చూస్తే తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news