రాజమౌళి మెప్పు పొందిన సంజీవని ట్రైలర్..!

sanjevani-trailer

కొత్త వాళ్లు ఎలాంటి సినిమా తీసినా సరే అది తనకు నచ్చితే వెంటనే దాని మీద తన అభిప్రాయాన్ని తెలియచేసే రాజమౌళి లేటెస్ట్ గా ఓ సినిమా ట్రైలర్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనురాగ్ దేవ్, మనోజ్ చంద్రా, తనూజా నాయుడు లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా సంజీవని.

రవి విదే డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూసి రాజమౌళి ఇంప్రెస్ అయ్యారు. క్లీన్ విజువల్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అద్భుతమైన గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో వచ్చిన సంజీవనికి తన ప్రశంసలు అందించారు రాజమౌళి. అతి తక్కువ బడ్జెట్ లో ఇలాంటి కమాండబుల్ అవుట్ పుట్ తీసుకురావడం గొప్ప విషయం. ఈ చిత్రయూనిట్ అందరికి తన బెస్ట్ విషెస్ అంటూ రాజమౌళి ట్వీట్ చేయడం జరిగింది.

బాహుబలి దర్శకుడే తమ సినిమా గురించి పొగడటం సంజీవని చిత్రయూనిట్ కు ఎంతో బలాన్ని ఇచ్చింది. గ్రాఫిక్స్ కాస్త అటు ఇటుగా ఉన్నా మి స్టీరియస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ లో బాగా చూపించారు. జక్కన్న ట్వీట్ తో ప్రస్తుతం ఈ సంజీవని గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Leave a comment