నన్ను అలా బెదిరించి … వాడుకున్నారు..! టాప్ డైరెక్టర్ పై సంచలన విషయాలు బయటపెట్టిన సంజన..!

165

పెద్ద మ‌నుషులుగా చ‌లామ‌ణీ అవుతున్న కొంద‌రి చీక‌టి కోణాలు మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఈ వివాదంలోకి కన్నడ భామ సంజన కూడా వచ్చి చేరారు. సంజన మొదటి సినిమా కన్నడలో వచ్చిన ‘గండా హెండతి’. 15 ఏళ్ల వయసులోనే ఆమె ఈ చిత్రంలో నటించింది. ముద్దు సన్నివేశాలతో సంచలనం సృష్టించిన మల్లికాశెరావత్ బాలీవుడ్ మూవీ ‘మర్డర్’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కథ చెప్పినప్పుడు సంజన తల్లి ముద్దు సన్నివేశాల గురించి ప్రస్తావించిందట.
2
అయితే కన్నడ సినిమాలో ఒకే ఒక్క ముద్దు సీన్ ఉంటుందని చెప్పి దర్శకుడు రవి శ్రీవాత్సవ ఆమెను ఒప్పించాడు. తీరా సెట్‌లోకి అడుగుపెట్టాక హిందీ ఒరిజినల్ మూవీకి ఏమాత్రం తీసిపోని విధంగా మసాలా కంటెంట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ముద్దు సీన్లతో పాటు సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లాను. అక్కడ నాపై పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను షూట్ చేశారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అయితే అవన్నీ నేను చేయడానికి ఒప్పుకోకపోతే నీ కెరియర్ నాశనం అవుతుందని బెదిరించి మరీ నాతో ఆ సీన్లు చేయించారని ఈ అమ్మడు వాపోతోంది.
1

Leave a comment