నానికి అంత సీన్ లేదు.. సంజన సెన్సేసనల్ కామెంట్స్..!

nani-sanjana-bigboss-2-telu

బిగ్ బాస్-2 హోస్ట్ గా నాని విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఆ సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే సెకండ్ సీజన్ ఎన్.టి.ఆర్ బిజీ అవడం వల్ల నానికి ఆ బాధ్యతలను అప్పగించారు. నాని తన మార్క్ చూపిస్తున్నా సరే ఎన్.టి.ఆర్ అంత జోష్ ఫుల్ గా యాంకరింగ్ చేయట్లేదని అంటున్నారు.

ఈ క్రమంలో రీసెంట్ గా మొదటి వారం బిగ్ బాస్ హౌజ్ నుండి నిష్క్రమించిన సంజనా కూడా నాని హోస్టింగ్ పై కామెంట్ చేశింది. బిగ్ బాస్ షో నడిపించేంత స్టఫ్ నానికి లేదని అన్నది సంజనా. సినిమాల పరంగా నాని ఇష్టమే కాని ఎన్.టి.ఆర్ లా మాత్రం నాని చేయట్లేదని అంటుంది సంజనా.

తాను ఎన్.టి.ఆర్ కు వీరాభిమానిని.. అందుకే తనకు ఎన్.టి.ఆర్ హోస్టింగే నచ్చిందని చెబుతుంది సంజనా. ఇక బిగ్ బాస్ లో వారం మాత్రమే ఉండేందుకు తనని తీసుకున్నారని తన ప్లేస్ లో వచ్చిన నందిని ఒక వారం తర్వాత జాయిన్ అవుతానని చెప్పగా తనని తీసుకున్నారని అన్నది. ఇకముందు బిగ్ బాస్ షోకి మాత్రం తాను వచ్చేది లేదని చెప్పింది సంజనా. మోడల్ గా తనెవరో ఇదవరకు ఎవరికి తెలియదు కాని బిగ్ బాస్ లో వారం రోజులు ఉండి ఆమె సెలబ్రిటీ అయ్యింది.

Leave a comment