Newsఎన్టీఆర్ మీరే నా బిగ్ బాస్.. అవి పుకార్లు మాత్రమే.. సంపూ...

ఎన్టీఆర్ మీరే నా బిగ్ బాస్.. అవి పుకార్లు మాత్రమే.. సంపూ సంచలన ట్వీట్..!

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ హౌజ్ నుండి మధ్యలో బయటకు వచ్చేశాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తారక్ ఎంత ప్రోత్సహించినా సరే ఆ హౌజ్ లో మనుషుల మధ్య ఇమడలేకపోయిన సంపూ నానా హంగామా చేసి బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చాక రియల్ లైఫ్ హీరో అవ్వలేని నువ్వు రీల్ హీరో ఎలా అవుతావని ప్రేక్షకులు ప్రశ్నించారట. ఆ విషయాన్నే నిన్న బిగ్ బాస్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి చెప్పినా తన పూర్తి ప్రసంగం వేసేందుకు సమయం సరిపోలేదని తన బాధ అంతా తన సోషల్ బ్లాగ్ లో వెళ్లబుచ్చాడు సంపూర్ణేష్.

మనకి కష్టమొచ్చినప్పుడు మన భుజం తట్టినవాడే నిజమైన హీరో.. తాను మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు తనకు ఇంత ప్రేమ పంచిన మా రియల్ బిగ్ బాస్ తారక్ అన్నకి సదా ఋణపడి ఉంటానని అన్నారు సంపూర్ణేష్ బాబు. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు రావడం పిరికితనం వల్ల కాదని నాలుగు గోడల మధ్య క్లాస్త్రోఫోబియా వల్లే తను బయటకు రావాల్సి వచ్చిందని అన్నారు.

చట్టపరమైన, ఆర్ధిక పరమైన చర్యలను కూడా లెక్క చేయకుండా తాను బయటకు వచ్చానంటే తాను ఎంత మాన్సిక ఒత్తిడికి గురయ్యానో అర్ధం చేసుకోవచ్చు. నేను చేసిన ఈ పనికి నా వృత్తికి లింక్ పెట్టడం చాలా బాధపెట్టింది. స్పెషల్ స్టేటస్ కోసం 10 గంటలు జైల్లో పెట్టినా నా ధైర్యం సడలలేదు. కాని మొదటిసారి మనసుకి బాధ కలిగించింది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్టార్ మా, బిగ్ బాస్ యాజమాన్యానికి తన ధనువాదాలు తెలియచేశాడు సంపూ. ఇక సడెన్ గా బయటకు రావడం వల్ల తనకు 15 లక్షల జరిమానా విధించిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చాడు. అది కూడా ఎన్.టి.ఆర్ కలుగ చేసుకుని సంపూకి ఎలాంటి పెనాల్టి లేకుండా చేశాడేమో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన సంపూ నిన్న తారక్ పక్కన కనబపడటం ఈరోజు ఇలా తన మనసులో మాటని వ్యక్తపరచడం అందరిని ఆలోచింపచేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news