Moviesసమ్మోహనం హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

సమ్మోహనం హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఇప్పటిదాకా సరైన హిట్ కొట్టలేదు. ప్రేమ కథా చిత్రం హిట్ కొట్టినా అది కాస్త మారుతి ఎకౌంట్ లోకి వెళ్లింది. భలే మంచి రోజు పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సుధీర్ చేసిన సమ్మోహనం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సుధీర్ బాబుకి హిట్ ఖాతా తెరచిందని చెప్పొచ్చు.

సోలోగా తన స్టామినాతో సుధీర్ బాబు ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. కథ, కథనాలు అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని తెలుస్తుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ యాక్టింగ్ ఆ పాత్రల మధ్య కన్వర్షన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయట. నిజాయితీగల ప్రయత్నం ఎవరు చేసినా సక్సెస్ అవుతుందని మరోసారి సమ్మోహనంతో ప్రూవ్ అయ్యింది.

సుధీర్, అదితిల కెమిస్ట్రీ కూడా బాగుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. ఇంద్రగంటి మార్క్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అక్కడక్కడ స్లో అయ్యిందన్న భావన వచ్చినా సినిమా ఫలితం మీద ఆ ఎఫెక్ట్ పడలేదు. ఫైనల్ గా సుధీర్ బాబు సోలోగా హిట్ కొట్టిన సినిమాగా సమ్మోహనం ఘట్టమనేని ఫ్యాన్స్ ఉత్సాహపడేలా చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news