అక్కినేని కోడలిని వదలని ఆ హీరో..!

Samantha next with star hero?

డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తన వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేశాడు. అల్లుడు శీను నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన సాక్ష్యం వరకు సినిమాలైతే చేస్తున్నాడు కాని బెల్లంకొండ శ్రీనివాస్ అందుకు తగినట్టుగా ఫలితాలను మాత్రం అందుకోవడం లేదు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమా చేస్తున్నాడు. తేజ డైరక్షన్ లో వస్తున్న సీత సినిమాతో వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాతో కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా కన్ ఫాం చేయగా.. ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం సినిమాలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తాడని తెలుస్తుంది. ఆరెక్స్ 100 సినిమా లవ్ ఫెయిల్యూర్ కుర్రాడి సినిమా కాగా మహా సముద్రం మాఫియా నేపథ్యంతో సాగుతుందట. ఈ మూవీలో హీరోయిన్ గా అక్కినేని కోడలు సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఆల్రెడీ అల్లుడు శీను సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సమంతతో జోడీ కట్టాడు. మొదటి సినిమానే స్టార్ హీరోయిన్ తో జతకట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కాస్టింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవడు. మరి ఈ మహా సముద్రం ఎలా ఉంటుంది. అందులో శ్రీనివాస్ ఎలా కనిపిస్తాడు అన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a comment