Gossipsసమంత సంసారంలో చిచ్చు పెడుతున్న మరో అమ్మాయి..!

సమంత సంసారంలో చిచ్చు పెడుతున్న మరో అమ్మాయి..!

ఏమాయ చేసావే సినిమాతో జంటగా నటించిన నాగ చైతన్య, సమంత క్రేజీ పెయిర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో ఈ జంట ప్రేక్షకులను మెప్పించింది. ఇక లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో వీరిద్దరు పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా సమంత వరుస సినిమాలు చేస్తుంది.

అయితే పెళ్లి తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించే సినిమా మాత్రం క్రేజీగా మారుతుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో చైతు, సమంతలు కలిసి నటిస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చైతు, సమంతలు భార్య భర్తలుగానే నటిస్తున్నారు. రియల్ లైఫ్ దంపతులైన వీరు సినిమాలో కూడా అలా నటించడం విశేషం. ఇక వీరిద్దరి మధ్యలో మరో అమ్మాయి వీరికి అడ్డుగా మారుతుందట.

చైతు, సమంతల మధ్య మరో అమ్మాయి వస్తుందట. ఆ అమ్మాయి ఎవరు వారిద్దరి ఎందుకు విడదీయాలనుకుంది. ఫైనల్ గా వారి కథ ఎలా ముగుస్తుంది అన్నది శివ నిర్వాణ సినిమా కథ అట. సేమ్ నిన్ను కోరి కథలా అనిపిస్తున్నా అందులో హీరోయిన్ ప్రేమించిన వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అతని మనసు మారేలా చేస్తాడు. చైతు, సమంతల సినిమాలో హీరో మరో అమ్మాయిని లవ్ చేయడం ఆమె గురించి వీరు కొట్లాడటం లాంటి కథతో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news