నేనా తల్లిని కాబోతున్నానా?..హవ్వా..!

187

టాలీవుడ్ అందమైన పెల్లైన ప్రేమ జంట ఎవరు అంటే వెంటనే చెబుతారు నాగ చైతన్య-సమంత. ఏం మాయ చేసావే సినిమాలో పరిచయం తర్వాత పెళ్లికి దారి తీసింది. ఆటోనగర్ సూర్య, మనం సినిమాల తర్వాత పెద్దలను ఒప్పించి సమంత-చైతూలు రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైన తర్వాత సమంత నటిస్తున్న సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. ఇటీవల చైతూ-సమంత కలిసి నటించిన ‘మజిలీ’సినిమా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా అక్కినేని వారింటి కోడలు సమంత, తన ట్విట్టర్ ఎకౌంట్ ఖాతాను బేబీ అక్కినేనిగా మార్చుకోగా, ఆమె తల్లి కాబోతోందని, అక్కినేని వారింట నాలుగోతరం రానున్నదని ప్రచారం ప్రారంభమైంది.

ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో యాంకర్ “ఏంటి సమంత తల్లి కాబోతుందా?” అన్న ప్రశ్నకు సమంత స్పందించింది. “డామ్… అవునా? మీకు తెలిస్తే నాక్కూడా చెప్పండి” అని వ్యంగ్యంగా స్పందించింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో ఆ తీపి కబురు ఏమీ లేదన్నట్లు అనిపిస్తుంది.

Leave a comment