జక్కన్న-తారక్-చరణ్(RRR) మూవీ.. అంత సీన్ లేదంటున్న సమంత!

21

ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరూ ఎదురుచూసే సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం. ఈ సినిమాను బాహుబలి డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ టాలీవుడ్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
2
సమంత అక్కినేని పెళ్లి తరువాత తన స్పీడును పెంచి వరుస సినిమాలను బ్లాక్‌బస్టర్లుగా మలుస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే మహానటి, రంగస్థలం వంటి సినిమాల్లో ఈమె నటనకు మంచి మార్కులు పడగా తాజాగా యుటర్న్ అనే సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది అక్కినేని కోడలు. ఔట్ అండ్ ఔట్ సప్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈసినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తారక్-చరణ్ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘‘అంత సీన్ లేదు’’ అంటూ కౌంటర్ ఇచ్చిందట.
1
తాను ఆ సినిమాకు సైన్ చేయలదని కండ బద్దలు కొట్టింది ఈ బ్యూటీ. రాజమౌళి డైరెక్షన్‌లో ఈగ చిత్రంలో నటించిన సమంత మరోసారి అవకాశం వస్తే తప్పక నటిస్తానంటూనే ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయడం లేదంటూ చెప్పేసింది. దీంతో గాలిరాయుళ్ల నోర్లు మూతపడ్డాయి. మరి రాజమౌళి డైరెక్షన్‌లో ఈ సినిమాలో సమంత నటిస్తుందో లేదో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే అంటున్నారు కొంతమంది అభిమానులు.

Leave a comment