Gossipsవేశ్యగా సమంత పర్ఫెక్ట్.. ఆ ఇద్దరికి షాక్ ఇవ్వనుందా..?

వేశ్యగా సమంత పర్ఫెక్ట్.. ఆ ఇద్దరికి షాక్ ఇవ్వనుందా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత తన సత్తా చాటుతుంది. పెళ్లైన తర్వాత ఏ హీరోయిన్ అయినా క్రేజ్ తగ్గుతుంది కాని సమంత పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్ కొనసాగిస్తుంది. ఇక చేస్తున్న సినిమాలు కూడా వరుసగా హిట్లు కొట్టడంతో సమంత ఇంకాస్త రెచ్చిపోతుంది. ప్రస్తుతం సమంత తమిళంలో సూపర్ డీలక్స్ సినిమా చేస్తుంది. విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ముఖ్య పాత్ర పోశించారు.

సినిమాలో రమ్యకృష్ణ, సమంత వేశ్యలుగా కనిపిస్తారట. సమంత ఈ పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా తీసుకుందట. అంతేకాదు ఈ కథ తన దగ్గరకు రాడానికి ముందే వేరే హీరోయిన్స్ ఇద్దారు చేయనని చెప్పారట. అలా ఇద్దరు హీరోయిన్స్ చేయనని చెప్పిన పాత్రకు సమంత ఓకే చెప్పింది. ఇంతకీ సమంత కన్నా ముందు ఈ సినిమాను కాదన్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ముందు ఈ సినిమా గురించి చైతుకి చెప్పినప్పుడు షాక్ అయ్యాడని కాకపోతే సినిమా కథ మొత్తం విని ఒప్పుకున్నాడని చెప్పింది సమంత.

ఇక తెలుగులో కూడా సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారనుంది. యూటర్న్ తర్వాత ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేస్తున్న సమంత తెలుగు, తమిళంలో పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. మరి వేశ్యగా సమంత చేసిన సూపర్ డీలక్స్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news