పెళ్ళైన కొద్దిరోజులకే సమంత ‘యూ టర్న్’

samantha

అక్కినేని వారి కోడలు అప్పుడే యూటర్న్ తీసేసుకుంది. పెళ్ళైనా ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తోంది. వెండితెరపై తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న సమంత నిర్మాతగా మారుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి తరువాత పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే తీరక చేసుకుని మళ్ళీ కథన రంగంలోకి దూకబోతోంది. అందుకే కొత్త ప్రోజెక్టుల మీద ద్రుష్టి పెట్టింది. అందుకే ఈ అమ్మడు కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడంతో పాటు తానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాలని సమంత నిర్ణయించుకుంది.

కన్నడంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘యూ టర్న్’ అనే సినిమా రీమేక్ హక్కులను ఈ భామ సొంతం చేసుకుంది. ఆ సినిమాను తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటోంది. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ కన్నడ సినిమా ఎటువంటి హడావుడి లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో సమంత నిర్మించబోయే ఈ సినిమాలో పాత్రధారులుకొత్త వాళ్ళు ఉంటారో లేక పాతవాళ్లతో కానిచ్చేస్తుందో ఆమెకే తెలియాలి.

Leave a comment