Gossipsమన్మథుడితో సమంత ! ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ...?

మన్మథుడితో సమంత ! ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా …?

వెండితెర మన్మథుడిగా అక్కినేని నాగార్జున డిఫ్రెంట్ కాన్సెప్ట్స్ తో ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఆమె కోడలు సమంత కి ఉన్న క్రేజ్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ… వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఈమె కు పెళ్లయినా… సినిమాలు అవకాశాలు మాత్రం తగ్గడంలేదు.

ఇంతకీ ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే…? గతంలో సూపర్ హిట్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్ మన్మథుడు 2 తీసేపనిలో నాగార్జున ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీతీ సింగ్ నటిస్తుండగా… సమంత కూడా ఓ పాత్రలో కనిపించబోతోందట. గతంలో వీరిద్దరు మనం, రాజుగారి గది 2 సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో ఈ సినిమా మీద కూడా అదే సెంటిమెంట్ పెట్టుకున్నారు.

ఈ సినిమాకు హీరో రాహుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈ పాత్రకు సమంత అయితే బావుంటుందని, కోడలిని మామ అడగటం… వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్‌. అలాగే చిత్రదర్శకుడు రాహుల్, సమంత మంచి స్నేహితులు కావడం కూడా ఈమె స్పెషల్ గెస్ట్ పాత్రలో నటించేందుకు ఓ కారణం అని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జునే ఈ సినిమాను నిర్మించనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో పాయల్ రాజపుత్ కూడా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news