Gossipsమామతో పోటీపడుతున్న సమంత

మామతో పోటీపడుతున్న సమంత

ఓ సినిమా హిట్టైతే వెంట‌నే సీక్వెల్ రెడీ అయిపోతోంది. కానీ రాజు గారి గ‌ది 2 మాత్రం మ‌ల‌యాళంలో హిట్టైన ప్రేత‌మ్ రీమేక్‌గా తెర‌కెక్కింది.అయితే క‌థ ప‌రంగా 70 శాతం మార్పులు చేసి, ఈ సినిమాని రూపొందించాన‌ని డైరెక్ట‌ర్ ఓంకార్ చెబుతున్న మాట‌! అంతేకాదు క‌థ రాసుకున్న‌ప్పుడు నాగ్ ని అస్స‌లు అనుకోలేద‌ని, ప్రొడ్యూస‌ర్ స‌ల‌హాతో తాను నెరేష‌న్ ఇచ్చాక వెంట‌నే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని చెప్పారు.
అంతేకాక ఈ సినిమాలో మామ, కోడ‌ళ్ల న‌ట‌న హైలెట్ అని, నాగ్ పోషించిన మెంట‌లిస్ట్ క్యారెక్ట‌ర్‌కు బీ , సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కులు కూడా క‌నెక్ట్ అవుతార‌ని అన్నారు.ఇంకా ఆయ‌నేమ‌న్నారంటే.. ‘‘కథ సిద్ధమయ్యే వరకే ‘ఇలా చేద్దాం, అలా చేస్తే ఎలా ఉంటుంది?’ అని సలహాలు ఇస్తుంటారు నాగార్జున. సెట్‌కి వెళ్లాక ‘దర్శకుడు ఏం చెబితే అది చేస్తా’ అంటారు. నాగార్జున, సమంత పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
అప్పుడప్పుడు తన అనుభవంతో మాకు సలహాలు ఇచ్చారు నాగార్జున. ఆయన చేసిన మెంటలిస్ట్‌ పాత్ర బి, సి కేంద్రాల్లోని ప్రేక్షకులకూ నచ్చేలా, మరింత స్టైలిష్‌గా ఉంటుంది. ‘బొమ్మరిల్లు’ క్లైమాక్స్‌తో మాటల రచయిత అబ్బూరి రవి ఎంతగా పేరు తెచ్చుకొన్నారో, ఈ సినిమాతో అంతకంటే ఎక్కువగా ఆయన గురించి మాట్లాడుకొంటాం’’.అని తెలిపారు. రాజు గారి గ‌దికి కొన‌సాగింపుగా మ‌రికొన్ని చిత్రాలు త‌న నుంచి వ‌స్తాయ‌ని ఓంకార్ తెలిపారు. ఈ దీపావ‌ళి కానుక‌గా వ‌స్తున్న ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news