పెళ్ళైనా వాటికి దూరం కానీ సమంత … ?

samantha

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకున్న సమంత తాజాగా అక్కినేని వారి ఇంటి కోడలు అయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో సుదీర్ఘ కాలం ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు గత నెలలో గోవాలో వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టింది. సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగులో రంగస్థలం, మహానటితో పాటు తమిళంలో రెండు చిత్రాలు నటిస్తుంది.

ఈ సమయంలోనే సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసి, కొంత కాలం లేదా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు సమంత అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావని, సమంత ఖచ్చితంగా సినిమాల్లో కంటిన్యూ అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

పెళ్లికి ముందు ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుంది. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం కనుక ఆమె అభిరుచిని, ఆసక్తిని గౌరవిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సమంత కూడా పెళ్లి చేసుకున్నంత మాత్రాన సినిమాలను వదిలేయాలా అంటూ ఒక మీడియా మీట్‌లో చెప్పుకొచ్చింది. అంటే ఖచ్చితంగా సమంత సినిమాలకు గుడ్‌ బై అయితే చెప్పదు. బ్రేక్‌ తీసుకున్నా ఒకటి రెండు నెలల్లోనే కమ్‌ బ్యాక్‌ ఉంటుందని ఆమెను దగ్గర నుండి పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. అందుకే సమంత అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

Leave a comment