Gossipsసాక్ష్యం 3 డేస్ కలక్షన్స్.. కష్టాల్లో బయ్యర్లు..!

సాక్ష్యం 3 డేస్ కలక్షన్స్.. కష్టాల్లో బయ్యర్లు..!

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్దె కలిసి నటించిన సినిమా సాక్ష్యం. శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ నిర్మించారు. పంచభూతాల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 3.11 కోట్ల వసూళ్లను రాబట్టగా రెండో రోజు 1.75 కోట్లు, 3వ రోజు 1 కోటి రూపాయలను రాబట్టిందట.

ఓవరాల్ గా ఇప్పటి వరకు సాక్ష్యం 5 నుండ్ 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. సినిమా మహా అయితే 10 కోట్లు కలెక్ట్ చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 28 కోట్లు వస్తేనే కాని బ్రేక్ ఈవెన్ అవని ఈ సినిమా మళ్లీ బెల్లంకొండ బాబుకి నిరాశ పరచిందని చెప్పొచ్చు. ఇక ఏరియాల వారిగా కలక్షన్స్ వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news