సాక్ష్యానికి ఎదురు దెబ్బ..రిలీజ్ కి ముందే సినిమా లీక్..!

27

బెల్లంకొండ హీరో శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాక్ష్యం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే పంచ భూతాల ప్రస్థావన వచ్చింది కాబట్టి కచ్చితంగా ఇదో సోషియో ఫ్యాంటసీ సినిమా అని అనుకున్నారు. కాని అసలు సినిమా కథ మొత్తం లీక్ అయ్యింది.

సినిమాలో హీరో వీడియో గేం డెవలపర్ అట. అతను ఆడుతున్న గేం ద్వారా శత్రువులను సంహరిస్తాడట. గేం కు.. వారు చనిపోడానికి గల రీజన్సే అసలు కథ అని తెలుస్తుంది. టీజర్ తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన సాక్ష్యం కచ్చితంగా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పొచ్చు. డిజేలో బికినితో అలరించిన పూజా హెగ్దె ఈ సినిమాలో హీరోయిన్ కాబట్టి ఇందులో అమ్మడు ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అని అంచనాలు పెంచుకున్నారు పూజా అభిమానులు.

Leave a comment