నాగ చైతన్య ” శైలజా రెడ్డి అల్లుడు ” రివ్యూ & రేటింగ్

33

అక్కినేని నాగ చైతన్య, మారుతి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రిచ్ బిజినెస్ మెన్ కొడుకైన చైతన్య (నాగ చైతన్య) మొదటి చూపులోనే అను (అను ఇమ్మాన్యుయెల్)ను చూసి ప్రేమిస్తాడు. చైతు అనుని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు చూసి ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే శైలజా రెడ్డి కూతురైన అను ఆమె తన తల్లితో ఎడమొహం పెడ మొహంగా ఉంటుంది. చైతన్య వారిద్దరిని కలపాలని నిర్ణయించుకుంటాడు. తల్లి కూతుళ్లని కలిపి తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అన్నదే శైలజా రెడ్డి అల్లుడు కథ.
Still 4 copy
నటీనటుల ప్రతిభ :

నాగ చైతన్య లుక్స్ పరంగా బాగున్నాయి. తన రోల్ వరకు తాను బాగా చేశాడు. చైతన్య పాత్రలో నాగ చైతన్య నూటికి నూరు పళ్లు న్యాయం చేశాడు. ఇక అనుగా అను ఇమ్మాన్యుయెల్ గ్లామర్ డాల్ గా కనిపించింది. సినిమాలో చైతు, అనుల మధ్య స్క్రీన్ స్పేస్ బాగుంది. మురళి శర్మ, నరేష్ లు బాగానే చేశారు. ముఖ్యంగా టైటిల్ రోల్ పొశించిన రమ్యకృష్ణ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. థర్టీ ఇయర్స్ పృధ్వి నటన బాగుంది. ఆయన పంచులు సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. అతన్ని మారుతి సినిమా మొత్తం వాడేశాడు.
3a copy
సాంకేతికవర్గం పనితీరు :

నిజార్ షఫి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను చాలా కలర్ ఫుల్ గా అందంగా తీశారు. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యింది. మారుతి కథ, కథనాలు కాస్త బోర్ కొట్టించాయి అయితే ఫైనల్ గా వన్ టైం వాచ్ మూవీగా మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

మారుతి సినిమా అంటే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్స్ అన్న టాక్ ఉంది. ఈరోజుల్లో నుండి శైలజా రెడ్డి అల్లుడు వరకు మారుతి సినిమాలో ఉండే కామన్ పాయింట్ ఫన్ ఎలిమెంట్స్. అయితే శైలజా రెడ్డి అల్లుడులో ఫన్ ఉన్నా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ గాఫ్ బాగా రాసుకున్న మారుతి సెకండ్ హాఫ్ ఆడియెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసాడు.

సెకండ్ హాఫ్ బాగా స్లో అవుతుంది.. అంతేకాదు పాయింట్ లెస్ గా వెళ్తుంది. అందుకే ఆడియెన్స్ బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. సినిమాలో రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయెల్ పాత్రలు బాగా కుదిరాయి. వెన్నెల కిశోర్, పృధ్వి కామెడీ కాసేపు అలరిస్తుంది. అయితే శైలజా రెడ్డి అల్లుడు ఒకసారి చూసే సినిమాగా వస్తుంది కాని కచ్చితంగా అంచనాలను మాత్రం అందుకోలేదు.
1
ప్లస్ పాయింట్స్ :

రమ్యకృష్ణ

ఫస్త్ హాఫ్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

ఊహించే కథనం

సెకండ్ హాఫ్

బాటం లైన్ :

శైలజా రెడ్డి అల్లుడు మంచి ఫామిలీ ఎంటర్టైన్మెంట్ ..!

రేటింగ్ : 3/5

Leave a comment