మెగాస్టార్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..

sai pallavi rejects nithin

మొదటి సినిమాతోనే భానుమతి‌గా ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసుకున్న మలయాళీ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన అభినయంతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చెయ్యడంలో ఈ ఫిదా పిల్లను మించిన వారు లేరు. ఏ ముహూర్తాన టాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో కానీ ప్రతి హీరో ఆ ఫిదా పిల్ల పక్కన నటించాలనే చూస్తున్నారు. అంత డిమాండ్ పెరిగిపోయింది ఈ ముద్దుగుమ్మకి.

మొదటగా ఈమెను పరిచయం చేసిన దిల్ రాజు బ్యానర్లో మూడు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నా ఈ అమ్మడు రెండు సినిమాల్లో అయితే నటించింది. అయితే మూడో సినిమాలో మాత్రం నో చెప్పేసింది.
ఫిదా తరువాత నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో నటించింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’కు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.

తెలంగాణ మెగా స్టార్ (నితిన్), శర్వానంద్ కలిసి మల్టీస్టార్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా నితిన్ కి జంటగా సాయి పల్లవిని తీసుకోవాలని దిల్ రాజు భావించగా … ఆ ఆఫర్ ని సాయి పల్లవి తిరస్కరించిందట. దానికి ఓ కారణం ఉంది ఆ సినిమాలో ఆ ఫిదా పిల్ల పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆమె నిరాకరించింది. అందుకే చేసేది లేక ఆమె స్థానంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం ఆమె డిమాండ్ అలా ఉంది మరి.

Leave a comment