ఆ పనికి రూ.2 కోట్ల ఆఫర్ డోంట్ కేర్ అంది..!

152

సాధారణంగా సినీ రంగంలోకి వచ్చిన తర్వాత హీరోయిన్లకు మంచి పేరు వచ్చిందంటే..చాలు ఇక డబ్బు ఎన్ని రకాలుగా సంపాదించాల అన్న ఆలోచనలోనే ఉంటారు. ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లడం..షాపింగ్, రెస్టారెంట్స్ మరికొన్ని కార్యక్రమాల ఓపెనింగ్స్ కి గెస్ట్ గా వెళ్లి డబ్బులు బాగా డిమాండ్ చేయడం చూస్తుంటాం. ఇక వాణిజ్య ప్రకటనల్లో నటించడం షరా మామూలే.

కానీ ఓ హీరోయిన్ మాత్రం తనకు వచ్చిన ఆఫర్..అది కూడా పది లక్షలు, ఇరవై లక్షలు కాదు ఏకంగా రూ.2 కోట్ల ఆఫర్ నే కాదనుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగా పిదా చేసిన సాయిపల్లవి.

మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయిన సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఫేమస్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోలస సరసన చాన్స్ దక్కించుకుంటుంది. ఇటీవల ప్రముఖ ఉత్పత్తుల సంస్థ వారు తమ ఫేస్ క్రీమ్ ప్రకటనలో నటిస్తే.. రూ.2 కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ చేశారట. కానీ అందుకు ఆమె తిరస్కరించడమే కాకుండా ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న తను ఇలాంటి ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తానని అనుకున్నారంటూ ప్రశ్నించిందట.

మేకప్ లేకుండా యాడ్ షూట్ చేస్తామని చెప్పినా కూడా ఒప్పుకోలేదట. అందుకే సాయి పల్లవి నిజాయితిని చూసి కొంత మంది అబ్బో ఇంత పొగరా అనుకుంటే..ఆమె తెగ మెచ్చుకుంటున్నారు.

Leave a comment