Gossipsవామ్మో సాయి పల్లవికి ఇంత బలుపా ..?

వామ్మో సాయి పల్లవికి ఇంత బలుపా ..?

అంచు డాబే కానీ పంచె డాబు లేదట అలా ఉంది కొంటెపిల్ల సాయి పల్లవి తీరు. ఫిదా సినిమాతో ఓ రేంజ్ లో వెలిగిపోతున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మీద ఇప్పుడు ప్రశంసలు పోయి విమర్శలు ఊపందుకున్నాయి. ఈ అమ్మడుకి తెలుగు ఇండ్రస్ట్రీలో మంచి డిమాండ్ ఉండడంతో సెలెక్టెడ్ గా సినిమాలు ఎంపిక చేసుకుని మరీ నటిస్తోంది. మొన్నీమధ్య హీరో నాని తో గొడవ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతోంది.

సాయి పల్లవి తీరు ఏమి బాలేదని తను షూటింగ్ లో ఉన్న సినిమాల యూనిట్ సభ్యులు తరుచూ చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈమె నాగ శౌర్య హీరోగా నటిస్తున్న సినిమా లో నటిస్తోంది. అయితే విషయంలో కూడా ఇలాగే చేస్తోంది అనే వార్త వీటికి మరింత బలాన్ని ఇస్తోంది. ‘కణం’ అనే పేరుతో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీలో సాయి పల్లవిది కీలక పాత్ర ఇందులో నాగ శౌర్య హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ సగం పైనే అయిపొయింది. ద్విబాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కి సమయానికి రావడంలో సాయి పల్లవి బాగా లేట్ చేస్తుండటంతో హీరోతో సహా సాయి పల్లవి తీరుపై విసిగిపోయి ఉన్నారు.

కెరియర్ మంచి ఊపులో ఉన్న సమయంలో సాయి పల్లవి ఇలా చెయ్యడం ఆమె భవిష్యత్తుకు అంత మంచిది కాదని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు ఇప్పటివరకు స్టార్ హీరో పక్కన కూడా అవకాశం రాకముందే ఈ అమ్మడు ఇలా చేస్తే రేపు నిజంగా వల్ల పక్కన అవకాశం వచ్చి మంచి హిట్ కొట్టేస్తే ఈ అమ్మడు ఇంకెలా ప్రవర్తిస్తుందో అని నిర్మాతలు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news