Gossipsమెగా హీరో సినిమాకు ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌..

మెగా హీరో సినిమాకు ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌..

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత రీసెంట్‌గా చిత్ర‌ల‌హ‌రి సినిమాతో ట్రాక్‌లోకి వ‌చ్చాడు. చిత్ర‌ల‌హ‌రి సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా వ‌సూళ్ల ప‌రంగా చూస్తే సాయి రేంజ్ మార్కెట్‌కు త‌గిన సినిమా కాదు.. అయితే ఈ సినిమా రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ కావ‌డం కూడా ఓ మైన‌స్సే. ఇదిలా ఉంటే సాయి త‌న నెక్ట్స్ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి సినిమాతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన సాయి ఇప్పుడు మారుతి సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని క‌సితో ఉన్నాడు. ఇటు మారుతి కూడా ఇటీవ‌ల అంచ‌నాలు అందుకోలేదు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి మ‌ళ్లీ పెద్ద హీరోల‌తో సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.
1
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ – యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు భోగి టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది.టైటిల్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సాయి ధరమ్‌ ప్లే బాయ్‌ తరహా పాత్రలో కనిపించనున్నాడనిపిస్తోంది. వ‌చ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news