మహేష్ పై మెగా హీరో షాకింగ్ కామెంట్స్ !

mahesh babu

మిల్క్ బాయ్ మహేష్ అందం గురించి చెప్పాలంటే… ఎంత చెప్పినా తక్కువే ! టాలీవుడ్ హీరోల్లో అందగాడు ఎవరు అంటే తడుముకోకుండా మహేష్ పేరు చెప్పేస్తారు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మహేష్ ని మించిన సుందరాంగుడు లేడనే చెప్పెయ్యొచ్చు. మహేష్ సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.

ఈ మధ్యకాలంలో మహేష్ అందచందాలను పొగిడేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తోటి స్టార్ హీరోలే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఫ్యాన్స్ లో జోష్ పెంచేస్తున్నారు.
తాజాగా మెగా హీరో కూడా మహేష్ ని పొగిడే జాబితాలో చేరిపోయాడు.

జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ ఆ సినిమా విశేషాలతో పాటు పనిలో పనిగా అనేక సరదా వ్యాఖ్యలు చేసాడు. దాంట్లో మహేష్ ప్రస్థావన రాగా మహేష్ మించిన అందగాడు ఉంటాడా సమస్యే లేదు.. అసలు అలా ఊహించుకోవడానికే కనీసం ఊహ రావడం లేదంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మాత్రమే కాదు అతని చార్మింగ్ గురించి సాటి హీరోలే మాట్లాడటం గొప్ప విషయమని చెప్పొచ్చు. గతంలోనే చరణ్ కూడా మహేష్ లో ఉన్న అందం తనకు ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తేజ్ ఏకంగా మహేష్ ను మించిన అందగాడు లేడని చెప్తున్నాడు.

Leave a comment