Gossipsసాయి ధరం తేజ్ కెరియర్ ను తొక్కేస్తుంది ఎవరు..?

సాయి ధరం తేజ్ కెరియర్ ను తొక్కేస్తుంది ఎవరు..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, అనుపమ జంటగా నటించిన తాజా చిత్రం ‘ తేజ్ ఐ లవ్ యు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వరుస అపజయాలతో సతమతమౌతున్న సాయి ధరమ్ కి ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. తేజు కెరీర్ మొదట్లో విడుదలైన పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ సినిమాలు తేజు కి మంచి విజయాల్ని అందించాయి. అటు తరవాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్ ఇలా ఐదు వరుస ఫ్లాపులతో కెరీర్ ని సంక్షోభం లో పెట్టుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. సుప్రీమ్ సినిమాతో తేజు కెరీర్ పీక్ స్టేజి కి తీసుకు వెళ్లిందని చెప్పొచ్చు. మెగా అభిమానులని ఈ చిత్రం ఎంత గానో ఆకట్టుకుంది.

అయితే తేజు కెరీర్ ఇలా అవటానికి గల ముఖ్య కారణం ఏంటని ఆరా తీస్తే దానికి ప్రధాన కారణం తేజునే అని తెలుస్తుంది. ఎందుకంటే సినిమా కథల విషయంలో తనదే ఫైనల్ నిర్ణయమని సినీ వర్గాల టాక్, ఇక ఇప్పటి నుండైనా తేజు కథల ఎంపిక లో మెగా హీరోల అభిప్రాయం తీసుకోవాలని పలువురు తేజు కి చెప్పారట. మరో వైపు వరుణ్ తేజ్ విభిన్న కథలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇక ఈ రోజు విడుదలైన ‘తేజ్ ఐ లవ్ యు’ అయినా తేజు ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకు వస్తుందో లేదో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news