డ్రంక్ అండ్ డ్రైవ్ లో మెగా మేనళ్లుడు.. బ్రీత్ ఎనలైజర్ షాక్ ఇచ్చింది..!

sai-dharam-tej-drunk-and-dr

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ జూబిలీ హిల్స్ పోలీసులు ఏర్పాటు చేసిన వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వారిని పట్టుకునే క్రమంలో 22 కార్లు, 29 బైకులు, ఒక ఆటోని సీజ్ చేశారని తెలుస్తుంది. ఇక ఆ సమయంలో మెగా హీరో సాయి ధరం తేజ్ కూడా ఆ లైన్ లో ఉన్నాడట. సెలబ్రిటీస్ అయినా సరే వదిలిపెట్టని పోలీసులు సాయి ధరం తేజ్ కు బ్రీత్ ఎనలైజర్ ఇచ్చారట.

అయితే అది చూపించిన పాయింట్లు చూసి షాక్ అయ్యారట పోలీసులు. మెగా హీరో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహిస్తాడనుకుంట అసలు ఏమాత్రం మందు తాగలేదని బ్రీత్ ఎనలైజర్ చూపించిందట. దీనితో ఆయనకు ఎంచక్కా రూట్ క్లియర్ చేశారు. సెలబ్రిటీస్ పబ్లిక్ లో తమ పరువు పోగొట్టుకునే పనులు చేస్తే దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.

రీసెంట్ గా న్యూ ఇయర్ పార్టీలో యాంకర్ ప్రదీప్ హంగామా అందరికు గుర్తుండే ఉంటుంది. మరి తాగాల్సి వస్తే ఓ డ్రైవర్ ను అయినా మెయింటైన్ చేస్తున్నారు తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం పట్టుబడట్లేదు. ఈమధ్య సిటీ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్ల సెలబ్రిటీస్ కూడా తమ జాగ్రత్తల్లో ఉన్నారు.

Leave a comment