‘ సాహో ‘ పై దిల్ రాజు భారీ రిస్క్‌..

174

బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా సౌత్‌, నార్త్ ఇండియ‌న్ సినిమా అభిమానులు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిటింగ్లో ఉన్నారు. సాహో ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చింది. రిలీజ్ డేట్ కూడా ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సాహో బిజినెస్ డీల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్స్ కూడా ఎగ‌ప‌డుతున్నారు. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో ఆరితేరిపోయిన దిల్ రాజు సాహో నైజాం, ఉత్త‌రాంధ్ర ఏరియాల రైట్స్ కోసం రూ.45 కోట్లతో క‌ళ్లు చెదిరే డీల్ నిర్మాత‌ల‌కు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ మొత్తాన్ని మించి ఇంకెవ‌రు కోడ్ చేసేందుకు కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితి. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో రాజుకు ఉన్న నెట్‌వ‌ర్క్‌తో పాటు ఇంత భారీ మొత్తం కోడ్ చేసినందుకు అయినా సాహో నైజాం, ఉత్త‌రాంధ్ర రైట్స్ ఆయ‌న‌కే ద‌క్కుతాయ‌ని అంటున్నారు. రాజు సాహోపై ఇంత భారీ రిస్క్ చేశాడంటే సినిమాపై ఆయ‌న‌కు గ‌ట్టి న‌మ్మ‌క‌మే ఉంద‌ని అంటున్నారు.

అలాగే ప్ర‌భాస్‌ను ఆక‌ట్టుకోవ‌డానికి.. ప్ర‌భాస్‌తో ఫ్యూచ‌ర్‌లో సినిమా ప్లాన్ చేసుకునేందుకే రాజు ఈ ఎత్తు వేశాడ‌న్న చ‌ర్చ‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. రాజు – ప్ర‌భాస్ కాంబోలో ఇప్ప‌టికే మున్నా సినిమా వ‌చ్చింది. వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన మున్నా ప్లాప్ అయినా కూడా రాజు ప్ర‌భాస్‌తో మ‌రో సినిమా కోసం ఎప్ప‌టి నుంచో ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు.

Leave a comment