Moviesప్రభాస్ " సాహో " రివ్యూ & రేటింగ్

ప్రభాస్ ” సాహో ” రివ్యూ & రేటింగ్

సినిమా: సాహో
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, జాకీ శ్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, మండిరా బెడీ, తదితరులు
సంగీతం: తనిష్క్ బాగ్చి, గురు రాంధవ, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్
బ్యాక్‌గ్రౌండ్ స్కో్ర్: గిబ్రన్
సినిమాటోగ్రఫీ: ఆర్. మాధి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
దర్శకత్వం: సుజిత్
విడుదల తేది: 30-08-2019

ఎప్పుడెప్పుడా అని సినిమా లవర్స్ ఎదురుచూస్తోన్న ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ సాహో ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యాక్షన్ సినిమాలకు తాతగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లతో అంచనాలను ఒక రేంజ్‌లో క్రియేట్ చేసిన సాహో ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
ముంబై నగరంలో 2 వెయ్యి కోట్ల భారీ చోరీ జరుగుతుంది. దీని వెనకాల పెద్ద మాఫియా ముఠా ఉంటుంది. వారిని పట్టుకునేందుకు ఇండియన్ పోలీసులు నానా కష్టాలు పడతారు. దీంతో లేడీ ఆఫీసర్ అమృతా నాయర్‌(శ్రద్ధా కపూర్)ను రంగంలోకి దించుతారు. ఆమె ఆ ముఠా గుట్టును రట్టు చేసే క్రమంలో అకోక్(ప్రభాస్)ను కలుస్తుంది. అమృతను అశోక్ ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ అమృతకు కేవలం ఆ ముఠాను పట్టుకోవడమే ధ్యేయంగా ఉంటుంది. ఈ క్రమంలో అశోక్‌కు సంబంధించి ఓ షాకింగ్ నిజం తెలుస్తోంది. కాగా ఓ ఘటనలో అమృతా నాయర్‌ అశోక్‌కు దూరమవుతుంది. ఇంతకీ ఆమెకు ఏం జరిగింది..? అశోక్ ఎవరు..? చివరకు ఆ మాఫియా ముఠా గుట్టును ఎవరు రట్టు చేసి అంతమొందించారు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమా ఇండియన్ సినిమాలో లేదనే కొరతను సాహో సినిమా నెరవేర్చిందని చెప్పాలి. కేవలం యాక్షన్‌కు ప్రాధాన్యతను ఇస్తూ అదిరిపోయే సీక్వెన్స్‌లతో ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో అశోక్‌గా ప్రభాస్ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. అతడి పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు సుజిత్. అటు భారీ చోరిని చేధించే క్రమంలో ముంబై పోలీస్ ఓ అండర్ కవర్ ఆఫీసర్‌ను నియమిస్తుంది. చిన్న దొంగతనాలు చేస్తూ..మాఫియా ముఠాలకు సాయం చేసే పాత్రలో అశోక్‌ను చూపించారు. కాగా అతడిని ఓ కేసులో పట్టుకుంటుంది క్రైం బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్. ఈ క్రమంలో ఆమెను చూసి ప్రేమిస్తాడు అశోక్. కట్ చేస్తే కొన్ని సంఘటనలతో ఆమె కూడా అశోక్ అంటే ఇష్టపడుతుంది. కానీ ఆమె పోలీస్ కావడం.. అతడు దొంగతనాలు చేస్తుండటంతో వారిద్దరూ ఎప్పటికీ ఒకటి కాలేమని ఆమె చెబుతోంది. ఈ క్రమంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో అశోక్‌కు అమృతా దూరం అవుతుంది. ఓ అదిరిపోయే ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

ఫస్టాఫ్ ముగిసే సరికి సినిమాను పీక్స్ స్థాయిలో నిలబెడతాడు దర్శకుడు. ఒక యాక్షన్ సినిమాలో కావాల్సిన అంశాలన్నింటినీ ఫస్టాఫ్‌లో మిలితం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ మొదలవగానే అమృతను దూరం చేసిన ముఠాను అంతమొందచడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు అశోక్. ఈ క్రమంలో అశోక్ ఎవరనే నిజాన్ని రివీల్ చేస్తాడు దర్శకుడు. ఇక ఆ తరువాత వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మొత్తం ఓ 30 నిమిషాలు సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. చివరకు ఓ మంచి పాయింట్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు సుజిత్.

ఓవరాల్‌గా చూస్తే.. సాహో సినిమాపై ఎలాంటి అంచనాలైతే ఏర్పడ్డాయో వాటిని ఏమాత్రం మిస్ కాకుండా అందుకుంది ఈ సినిమా. ఎక్కడా అభిమానుల అంచనాలను తక్కువ చేయకుండా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లతో హోరెత్తించారు సాహో టీం. ఇక ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిజంగా పండగనే చెప్పాలి. ఈ సినిమాతో ప్రభాస్ నేషనల్ హీరో ఎందుకయ్యాడో మరోసారి ప్రూవ్ చేశాడు. యాక్షన్ లవర్స్‌కు బొంభాట్ ట్రీట్‌గా వచ్చిన సాహో క్లాసిక్ మూవీ లవర్స్‌ను మెప్పంచలేకపోవచ్చు.

నటీనటులు విశ్లేషణ:
బాహుబలి వంచి ఇంటర్నేషనల్ మూవీ సక్సెస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అతడి కోసం కన్నులు వాచిపోయేలా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాతో సాహో అనిపించాడు మన డార్లింగ్. ముఖ్యంగా ఆ యాక్షాన్ సీన్స్‌లో మనోడు చేసిన పర్ఫార్మెన్స్‌లకు సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్‌ను చూపించిన విధానంతో అభిమానుల అరుపులతో థియేటర్ల టాపులు లేచిపోయాయి. అటు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తొలిసారి సౌత్ఇండియన్ సినిమా చేసినా ఆమె పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. ప్రభాస్ సరసన పర్ఫెక్ట్ జోడీగా శ్రద్ధా యాక్టింగ్ కట్టిపడేసింది. ఈ సినిమాలో ఓ అరడజన్ బాలీవుడ్ నటులు ఉన్నారు. వారంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక కమెడియన్ వెన్నెల కిషోర్‌ ఉన్నంతలో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు.

టెక్నికల్ పర్ఫార్మెన్స్:
రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్న సుజిత్, రెండో సినిమాగా ఇంతటి భారీ బడ్జెట్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో అని సందేహ పడ్డ ప్రతివారికి తన సినిమాతో చెంప చెళ్లుమనేలా జవాబిచ్చాడు. సుజిత్‌పై ఎంత నమ్మకం లేకపోతే ఇంతటి భారీ బడ్జెట్ సినిమాను అతని చేతిలో పెడతారో ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చెబుతాడు. యాక్షన్ సీన్స్‌ను హాలీవుడ్‌ను తలతన్నేలా తెరకెక్కించిన ఈ తెలుగు కుర్రాడు టాలీవుడ్ స్థాయిని ఖచ్చితంగా పెంచాడనే చెప్పాలి. ఇక ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాలో కావాల్సిన అంశాలన్నింటినీ ప్రజెంట్ చేసి అదరగొట్టాడు. ఆర్.మాధి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌ను ఎంత నేచురల్‌గా చూపించాడంటే అది గ్రాఫిక్స్ అంటే నమ్మలేనట్టుగా ఉన్నాయి. ప్రతిఫ్రేంను చాలా బాగా చూపించాడు. ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది. ఈ సినిమాకు ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు మ్యూజిక్ అందించడంలో సంగీతం కాస్త ట్రాక్ తప్పిందని చెప్పాలి. గిబ్రాన్ అందించిన బీజీఎం మాత్రం గూస్ బంప్స్ తెప్పించాయి. యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ ఎందుకు పెట్టారో సినిమా చేసి నోరెళ్లబెట్టిన ఆడియెన్స్‌ను చూస్తే అర్ధం చేసుకోవచ్చు.

చివరగా:
సాహో – యాక్షన్ సినిమాలకే తోపు!

రేటింగ్:
3.25/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news