“ఆరెక్స్ 100 ” రివ్యూ & రేటింగ్

5

సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లే ప్రమోషన్స్ ఎలా చేయాలో ఈమధ్య నూతన దర్శకులకు బాగా తెలిసినట్టుంది. అందుకే బోల్డ్ సీన్స్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా అలాంటి క్రేజీ అటెంప్ట్ తో ఆరెక్స్ 100 అంటూ వస్తున్నారు కార్తికేయ. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అంటూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయిన శివ, డాడీ (రాంకీ)తో కలిసి ఉంటాడు. ఊళ్లో రాంకీ, విశ్వనాథం (రావు రమేష్) తో గొడవలు పడుతూ ఉంటాడు. మరో పక్క శివ, విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్పుత్) ప్రేమలో పడతాడు. శివ, ఇందు చాలా క్లోజ్ అవుతారు. పెళ్లి మ్యాటర్ ఇంట్లో చెప్పి వస్తానని వెళ్లిన ఇందు తండ్రి చూసిన ఫారిన్ సంబంధం ఓకే చేస్తుంది. శివను కాదని ఇందు వేరొకతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వా శివ విశ్వనాథం మీద పగ తీర్చుకునేందుకు తన ఆస్తులను ధ్వంసం చేస్తాడు. వాళ్ల మనుషులను కొడతాడు. ఇలా ఓ సైకోలా మారతాడు. ఇంతకీ శివ, ఇందు ఎందుకు విడిపోయారు..? విశ్వనాథం మీద శివ ఎలా పగ తీర్చుకున్నాడు..? అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

కొత్త కుర్రాడే అయినా కార్తికే తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. పాయల్ రాజ్ పుత్ అందంతో ఆకట్టుకుంది. సినిమాలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ హాట్ హాట్ గా ఉంటుంది. రావు రమేష్ ఫుల్ లెంగ్త్ రోల్ ఆకట్టుకుంటుంది. రాంకీ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించారు. అయితే ఆయన పాత్రకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించలేదు. దర్శకుడు కథ, కథనాల్లో ప్రతిభ చాటినా కేవలం హీరో హీరోయిన్ రొమాన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు అవుతుంది. కథనం చాలా స్లో అయ్యిందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఫైట్స్ కూడా ఆకట్టుకున్నాయి.

విశ్లేషణ :

ఆరెక్స్ 100 టైటిల్ పెట్టి.. బోల్డ్ సీన్స్ తో యువతను ఆకట్టుకునే టీజర్ వదిలాడు దర్శకుడు అజయ్ భూపతి. సినిమా మొత్తం ఆ టీజర్, ట్రైలర్ లో ఉన్న బోల్డ్ సీన్స్ ఉంటాయని ఆశించిన ప్రేక్షకులు నిరాశపడక తప్పదు. హీరో హీరోయిన్ రొమాన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన దర్శకుడు ఆ సీన్స్ మాత్రం బాగానే తీశాడు.

అయితే ఎప్పుడైతే హీరోయిన్ హీరోని వదిలి వెళ్తుందో అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. అయితే అప్పటి నుండి కథను చాలా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ అసలు కనిపించదు. ఇంటెన్స్ స్టోరీ లా చెప్పాలనుకున్న కథ కాస్త సరైన స్క్రీన్ ప్లే కుదరకపోవడంతో కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది.

కథ, కథనాల్లో దర్శకుడు చాలా సినిమాల రిఫరెన్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. కొత్తగా ట్రై చేశాడని చెబుతున్నా కథనం ఇదవరకు సినిమాలను ఫాలో అయ్యాడు. రొటీన్ కు భిన్నంగా కాకుండా కొత్తగా ప్రయత్నించాడని చెప్పొచ్చు. యువత నచ్చే అంశాలున్న ఆరెక్స్ 100 టైటిల్ కు సినిమాకు మ్యాచ్ అయినట్టు కనిపించదు.

ప్లస్ పాయింట్స్ :

హీరో క్యారక్టరైజేషన్

రొమాంటిక్ సీన్స్

ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

స్లో నరేషన్

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

ఆరెక్స్ 100.. అంచనాలను అందుకోలేదు..!

రేటింగ్ : 2.5/5

Leave a comment