Gossipsపాయల్ పాప అంతకుముందు కూడా రచ్చలే..!

పాయల్ పాప అంతకుముందు కూడా రచ్చలే..!

రీసెంట్ గా రిలీజ్ అయిన ఆరెక్స్ 100 సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించారు. యూత్ ఆడియెన్స్ ను మెప్పించే అంశాలన్ని పుష్కలంగా ఉండటంతో పాటుగా ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఆరెక్స్ 100 మూవీ వసూళ్ల హంగామా సృష్టిస్తుంది.

ఇక సినిమా హిట్ లో ముఖ్య పాత్ర వహించిన ఆరెక్స్ పాప అదేనండి పాయల్ రాజ్ పుత్ గురించి అందరు వెతకడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఆమె ఏం చేసింది. దర్శక నిర్మాతలు ఎక్కడ నుండి ఆమెను తీసుకున్నారని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆరెక్స్ 100 కంటే ముందు ఓ పంజాబ్ సినిమాలో నటించిన పాయల్ రాజ్ పుత్. అంతేకాదు బాలీవుడ్ సీరియల్స్ లో బాగా పాపులర్ ఈ అమ్మడు.

సీరియల్స్ మాత్రమే కాదు తన మీద ఆడియెన్స్ చూపులు పడేలా హాట్ ఫోటో షూట్స్ కూడా చేసింది. కేవలం ఆరెక్స్ 100లోనే కాదు ఆమె ఫోటో షూట్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. అవి చూసే దర్శకుడు అజయ్ ఈ సినిమాలో తీసుకున్నారు. మొత్తానికి ఆరెక్స్ 100తో పాయల్ క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news