Gossipsఇక్కడ హిట్టైన అక్కడ భారీ డిజాస్టర్

ఇక్కడ హిట్టైన అక్కడ భారీ డిజాస్టర్

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఆరెక్స్ 100 మూవీ 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రాగా 10 కోట్ల పైగా కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆరెక్స్ 100 మూవీలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించారు.

తెలుగు రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో ఈ సినిమా బాగా ఆడుతుంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా బొక్క బోర్లా పడ్డది. యూఎస్ లో ఈ సినిమా ఇప్పటివరకు 1,30,000 డాలర్స్ మాత్రమే వసూళు చేసింది. ఓవర్సీస్ ఆడియెన్స్ కు ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదని కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.

పాయల్ అందాలు తెలుగు యువతని పిచ్చెక్కేలా చేస్తున్నాయి. అందుకే యూఎస్ కలక్షన్స్ ఎలా ఉన్నా తెలుగులో మాత్రం ఈ సినిమా వసూళ్ల హంగామా చేస్తుంది. చూస్తుంటే 20 కోట్లతో సంచలనం విజయం అందుకునేలా ఉందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news