Gossipsబాహుబలి రికార్డ్స్ ని బద్దలకొట్టిన ఆరెక్స్ 100..!

బాహుబలి రికార్డ్స్ ని బద్దలకొట్టిన ఆరెక్స్ 100..!

ఆరెక్స్ 100 సినిమా ఎక్కడ బాహుబలి సినిమా ఎక్కడ అసలు ఆ సినిమా రికార్డులను ఎలా ఈ చిన్న సినిమా బద్ధలు కొట్టగలదు అంటే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో దేవి థియేటర్ లో మొదటి వారం కలక్షన్స్ లో ఆరెక్స్ 100 బాహుబలి-2 వసూళ్లను సైతం అధిగమించడం విశేషం. యూత్ ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్న ఆరెక్స్ 100 మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో గల దేవి థియేటర్ లో మొదటి వారంలో ఇప్పటి వరకు బాహుబలి-2 28,82,370 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో వరుణ్ తేజ్ తొలిప్రేమ 28,67,362 లక్షలు వసూళు చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆరెక్స్ 100 మూవీ ఈ రెండు సినిమాలను బీట్ చేసి ఏకంగా 29, 32, 867 గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాహుబలి లాంటి భారీ సినిమా రికార్డులను బీట్ చేయడం అంటే ఇది మాములు విషయం కాదు. అందుకే దర్శకుడు అజయ్ భూపతికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news