2 డేస్ కలెక్షన్స్.. విజేతని తొక్కి పడేసిన ఆర్ఎక్స్ 100

2-days-collections

కార్తికేయ ,పాయల్ జంటగా నటించిన చిత్రం ” RX 100 ” దీనిని అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ప్రేక్షకుల దగ్గర ఈ చిత్రానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ అవకముందే డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని 2.5 కోట్లుపెటుకొని రైట్స్ ని దక్కించుకున్నారంటేనే తెలుస్తుంది ఈ సినిమా పై ప్రజల్లో ఎంత ఆదరణ ఉందొ. మూవీ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో మొదటి రోజు 1.41 కోట్ల షేర్ ను రాబట్టింది.రెండొవ రోజు కోటి రూపాయిలదాకా షేర్ ని రాబట్టిందని తెలుస్తుంది. అదే రోజు విజేత చిత్రం కూడా రిలీజ్ అయింది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రం విజేత. కళ్యాణ్ దేవ్ , మాళవిక నాయర్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది .ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల్లో నెగటివ్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది.ఈ చిత్రం రెండు రోజులకి గాను 80 లక్షలు మాత్రమే వాసులు చేసింది.దాంతో ‘ఆర్ఎక్స్ 100’ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వారాంతం వరకు ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టడంతో పాటు భారీగా లాభాలను కూడా తెచ్చి పెట్టబోతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Leave a comment