ఆరెక్స్ 100 మొదటి రోజు లెక్క ఎంత..?

rx-100-1st-day-collections

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ఆరెక్స్-100 అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఘాటు ముద్దులు, హీటెక్కించే రొమాన్స్ తో వచ్చిన ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అనేస్తున్నారు ఆడియెన్స్.

అయితే కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా మొదటి రోజు కలక్షన్స్ పర్వాలేదని చెప్పొచ్చు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.41 కోట్లు వసూలు చేసింది. కొత్త హీరో కొత్త దర్శకుడు ఈ లెక్క సరితూగినట్టే. అయితే సినిమా టీజర్, ట్రైలర్ తో వచ్చిన హైప్ తో పోల్చుకుంటే ఇది తక్కువే అని చెప్పాలి.

ఏరియాల వారిగా ఆరెక్స్ 100 కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం : 0.65 కోట్లు

సీడెడ్ : 0.20 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.14 కోట్లు

గుంటూర్ : 0.09 కోట్లు

ఈస్ట్ : 0.13 కోట్లు

వెస్ట్ : 0.07 కోట్లు

కృష్ణా : 0.09 కోట్లు

నెల్లూరు : 0.04 కోట్లు

ఏపి/తెలంగాణా 1.41 కోట్లు

Leave a comment