చరణ్, బోయపాటి సినిమా పై అదిరిపోయే “ఆ రూమర్స్”.. ఎంతవరకు నిజం..!

ram-charan-boyapati-movie

రంగస్థలం తో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాం చరణ్ కొన్నాళ్లుగా వెనుకపడ్డట్టు కనిపించినా ఫైనల్ గా మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం చిట్టిబాబుగా చరణ్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమా హిట్ జోష్ లోనే బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు రాం చరణ్.

ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని అంటున్నారు. అయితే మెగా పవర్ స్టార్ ఫ్యాక్షన్ నేపథ్యం అనగానే ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాతో పోల్చుతున్నారు. ఇంద్ర-2గా రాం చరణ్ బోయపాటి శ్రీను సినిమా ప్రచారం జరుగుంతుండటం విశేషం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

చరణ్, బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అది ఇంద్ర-2నా మరేదైనా అన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా ఈ కాంబినేషన్ నుండి మాత్రం మెగా అభిమానులకు గుర్తుండిపోయే సినిమా వస్తుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు.

Leave a comment