త‌మ‌న్నా పెళ్లిపై కొత్త ట్విస్ట్‌..

183

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి 15 ఏళ్లు అవుతోంది. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ దాదాపు అందరు పెద్ద హీరోలతో నటించిన తమన్నా బాలీవుడ్లో కూడా సినిమాలు చేసింది. కెరీర్‌ పరంగా చూసుకుంటే చాలా సీనియర్ గా కనిపిస్తున్నా… ఆమె వయసు మూడు పదుల దశలోనే ఉంది. ఇటీవల కాస్త ఆఫర్లు తగ్గినా సీనియర్ హీరోలు మాత్రం తమన్నాకు ఛాన్సులు ఇచ్చేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఈ సంక్రాంతికి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆమె నటించిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ అయింది. ఇక గత ఏడాది కాలంగా తమన్నా పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తమన్నా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని… ఈ ఏడాది ఆమె తప్పకుండా పెళ్లి చేసుకుంటుంద‌న్న ప్రచారం మీడియాలో వినిపించింది. ఆమె తాజా ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే ‘ అది ఆగుతుంది లెండి ‘ అంటూ సమాధానం ఇచ్చింది. మ‌రి త‌మ్మూ బేబీ ఆన్స‌ర్‌తో ఆమె పెళ్లి కోసం వెయిట్ చేసే వారి ఫ్యూజులు ఎగిరిన‌ట్టే క‌దా..! తమన్నా చెప్పిన మాటలను బట్టి చూస్తే ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని తెలుస్తోంది. తాను పెళ్లి చేసుకునే లోగా సాధించాల్సినవి చాలానే ఉన్నాయని చెప్పింది.

తమన్నాకు మరో నాలుగైదేళ్ళ పాటు కెరీర్ కొనసాగించాలన్న కోరిక బలంగా ఉందని తెలిసి పోతోంది. ఇక ఈ మిల్కీ బ్యూటీ కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మిలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు కోలీవుడ్లో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తుంది. ఇక హిందీ సినిమా ఖామోషీ జూన్ 14న రిలీజ్ అవుతోంది. తమన్నా – ప్ర‌భుదేవా కాంబోలో తాజాగా వచ్చిన అభినేత్రి 2 మూవీ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే

Leave a comment