Gossipsమీ రూమర్స్ తగలెయ్య హద్దూ పద్దూ లేవా?

మీ రూమర్స్ తగలెయ్య హద్దూ పద్దూ లేవా?

ఈ మాటలు అంటుంది ఫిదా హీరోయిన్ సాయి పల్లవి. మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి అనూహ్య విజయాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు లో ఫిదా సినిమాతో ఈ అమ్మడికి ఎంతో మంచి పేరు వచ్చింది. తెలుగు, తమిళ, మాళియాల భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న సాయిపల్లవిపై కొంత కాలంగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

సాయి పల్లవి ఎన్ని రూమర్స్ వచ్చినా ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు కూడా గాలి వార్తలను అలానే వదిలేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ AL విజయ్ ను పెళ్లి చేసుకోవడానికి సాయి పల్లవి సిద్దమవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయ్. దాంతో ఇప్పుడు సాయి పల్లవి ఓ రేంజ్ లో సీరియస్ అవుతుంది.

రూమర్లు పుట్టించడం ఒక ఎత్తైతే ఇలాంటి పెళ్లి విషయాల్లో కూడా ఛండాలం చేయడం ఎంత వరకు న్యాయం అని సీరియస్ అవుతుంది. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ కథనాలపై సీరియస్ గా కామెంట్ చేస్ట్సున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. కొంచెమైనా సిగ్గుందా అని కామెంట్ చేస్తున్నారు. కాగా, డైరెక్టర్ విజయ్ ఇదివరకు అమలాపాల్ తో డేటింగ్ చేసి వివాహం చేసుకొని కొన్నాళ్ళకె విడిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news