Gossipsటాలీవుడ్ లో కొత్త వివాదం...సంచలనంగా మారిన స్పైడర్ 150 కోట్ల పోస్టర్..!

టాలీవుడ్ లో కొత్త వివాదం…సంచలనంగా మారిన స్పైడర్ 150 కోట్ల పోస్టర్..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా కలక్షన్స్ పోస్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ప్రకంపణలు సృష్టిస్తుంది. సినిమా మొదటి రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకోగా కలక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే బయట కలక్షన్స్ వివరాలు తెలియదు కాని సినిమా మొదటి రోజు 51 కోట్లు కలక్షన్స్ వచ్చాయని ఎనౌన్స్ చేశారు.

ఇక వారంలో 100 కోట్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఏకంగా స్పైడర్ ఏకంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని నిర్మాత ఠాగూర్ మధు పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేశారు. ఇంతటి ఘన విజయం అందించినందుకు ఆడియెన్స్ కు ఫ్యాన్స్ కు థ్యాంక్స్ అంటూ పోస్టర్ వదిలారు ఠాగూర్ మధు. మహేష్ స్టామినా కొద్ది కలక్షన్స్ వచ్చి ఉండొచ్చు కాని వీరు చెప్పినట్టుగా 150 కోట్లు వస్తాయా అన్నది అందరి డౌట్.

ఇక ఇంతటి భారీ కలక్షన్స్ సాధిస్తే పోస్ట్ రిలీజ్ హంగామా ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు అన్నది బయట వినిపిస్తున్న మాట. మొత్తానికి స్పైడర్ సంచలనాలతో మహేష్ షాక్ ఇచ్చాడని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news