Gossipsఒక గుత్తి ఎర్ర‌ద్రాక్ష రేటు వింటే... ఊపిరి ఆగిపోతుందేమో...

ఒక గుత్తి ఎర్ర‌ద్రాక్ష రేటు వింటే… ఊపిరి ఆగిపోతుందేమో…

పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. వైద్యులు కూడా ప్ర‌తి రోజు పండ్లు తినాల‌ని సూచిస్తుంటారు. పండ్ల ద్వారా ఎన్నో ర‌కాల అనారోగ్యాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. వైద్యులు కూడా ప్రతీరోజు పండ్లు తినాలని సూచిస్తుంటారు. అయితే ఈ పండ్ల ధ‌ర‌లు ఏకంగా ఆకాశాన్నంటుతున్నాయి. జ‌పాన్‌లో ఒక్క గుత్తి ఎర్ర ద్రాక్ష ఖరీదు 12 లక్షల యెన్లు.

12 ల‌క్ష‌ల యెన్లు అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో సుమారు రూ. 7.8 లక్షలు. ఈ రేటు చూసి మీ ఊపిరి ఆగినంత ప‌నైపోయిందా..! అత్యంత ఖరీదైన ఈ ద్రాక్ష పేరు ‘రూబీ రోమన్’. ఆకారంలో సాధారణ ద్రాక్షకన్నా కొంచెం పెద్ద‌గా ఉంటుంది. చాలా తీయ‌గా ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ప్ర‌స్తుతం జ‌పాన్‌లో ఈ ద్రాక్ష‌కు భారీ డిమాండ్ ఉంది. ఒక్కో ద్రాక్షపండు 20 గ్రాముల కన్నా అధిక బరువుతో ఉంటుంది.

అంటే వంద గ్రాముల‌కు స‌రాస‌రీన 5 పండ్లు తూగుతాయి. ఈ ప్రత్యేకమైన ద్రాక్షను జపాన్‌లోని ఇష్కావ్ ప్రాంతంలో పండిస్తున్నారు. ఇష్కావ్ సహకార సమితి ఈ ద్రాక్షను సాగుచేస్తోంది. కనాజావా మార్కెట్‌లో ఈ ద్రాక్ష గుత్తిని వేలం వేశారు. ఈ వేలంలో లోక‌ల్‌గా ఓ బడా కంపెనీ 12 లక్షల యెన్‌లకు సొంతం చేసుకుంది. కాగా ఇష్కావ్ సహకార సమితి రాబోయే సెప్టెంబరు నాటికి 26 వేల ద్రాక్ష గుత్తులను పండించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news