RRR ఫుల్‌ఫాం చెప్పేసిన నెటిజెన్లు.. నోరెళ్లబెట్టిన చిత్ర యూనిట్..

88

టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా ఈ సినిమాతో ఇండియన్ సినీ హిస్టరీలో ఓ సరికొత్త అధ్యయనానికి నాంది పలకాలని జక్కన్న చూస్తున్నాడు. ఇద్దరు స్వతంత్ర వీరుల కథను కాంటెంపరరీ సబ్జెక్ట్‌గా తెరకెక్కించి సినీ లవర్స్ ఫ్యూజులు తుక్కురేగ్గొడతానని రాజమౌళి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పకనే చెప్పేశాడు. ఇక ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటివరకు వచ్చిన ఊహాగానాలు ఒకెత్తైతే.. ఇప్పుడు వస్తున్న వార్తలు దాని బాబు లాంటిది.

RRR సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలా టైటిల్స్‌ను సజెస్ట్ చేస్తున్న నెటిజెన్లు.. వారి క్రియేటివీటీతో అదిరిపోయే అర్ధం వచ్చేలా ఓ టైటిల్ చెప్పేశారు. ఈ సినిమా ఇద్దరు దేశభక్తుల పోరాట ప్రతిమను మనకు చూపించనున్న సందర్భంలో ఈ సినిమాకు R-రఘుపతి R-రాఘవ R-రాజారాం అనే టైటిల్ అయితే సూపర్‌గా ఉండటమే కాకుండా యూనివర్సల్‌ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్‌కు సజెస్ట్ చేస్తున్నారు నెటిజెన్లు.

నెటిజెన్ల సజెషన్ చూసిన చిత్ర యూనిట్ నోరెళ్లబెట్టారు. ఇంత పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యే టైటిల్‌ను చిత్ర యూనిట్ కూడా సజెస్ట్ చేయలేకపోయామని వారు ఆలోచిస్తున్నారట. అయితే ఇదంతా ఒక పుకారు మాత్రమే అనేది కొసమెరుపు. ఇంకా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన పూర్తి పేరు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఇండియన్ స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment